చిట్ ఫండ్ మోసం చేసిందంటూ నిరసన - chitfund mundu nirsana
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు చిట్ ఫండ్ సంస్థ తనను మోసం చేస్తోందంటూ కిరాణా కొట్టు యజమాని నిరసనకు దిగారు. చిట్టి డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని తెలిపారు.
చిట్ ఫండ్ ఎదుట బాధితుడి నిరసన
ఆదిలాబాద్ పట్టణంలో కిరాణా కొట్టు యజమాని సతీష్..చిట్ ఫండ్ సంస్థ తనను మేసం చేస్తోందంటూ తన ఇద్దరు కూతుర్లతో ఆందోళన చేపట్టారు. మొదట చిట్ ఫండ్ భవనంపై అంతస్తు ఎక్కి నిరసన తెలపగా.. సిబ్బంది సముదాయించి కార్యాలయంలోకి తీసుకెళ్లారు. తనకు రావాల్సిన చిట్టి డబ్బులు ఇవ్వకపోతే పోలీసులను ఆశ్రయిస్తానన్నారు.