కేంద్రం గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటే దురదృష్టవశాత్తు కొత్తగా ఆవిర్భవించిన తెలుగు రాష్ట్రాలు అనుకున్నట్లుగా పాటు పడటం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలు తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఆయా పనులకు నిధులు కేటాయిస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు స్పందించడం లేదన్నారు. తొలిసారిగా మండల కేంద్రానికి వచ్చిన మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
'తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలు కావట్లేదు'
కేంద్రం ఆయా పనులకు నిధుల కేటాస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు స్పందించటం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో గాంధీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.
గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్