42ఏళ్ల వయసులో కేసు నమోదు..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యాదవరావు 1989లో మావోయిస్టులతో కలిసి ఓ హత్య కేసులో ఏ4 నిందితుడు. అప్పుడు ఆయన వయస్సు 42 ఏళ్లు. బెయిల్పై విడుదలైన యాదవరావు.. పోలీసులు, మావోయిస్టుల భయానికి కుటుంబంతో సహా ఊరు వదిలి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నా.. ఆచూకీ లభించలేదు.
72 ఏళ్ల వయసులో అరెస్ట్..
ప్రస్తుత ఎస్పీ విష్ణు వారియర్ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న వారి జాడ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తమకు వచ్చిన సమాచారంతో యాదవరావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హర్దపూర్లో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. యాదవరావు వయసు ప్రస్తుతం 72ఏళ్లు. ఆయన్ను జైలుకు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
యవ్వనంలో కేసు... వృద్ధాప్యంలో జైలు.. ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం