అయోధ్యలో రామాలయ భూమిపూజ కార్యక్రమాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగని రోజుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. అయోధ్యలో భూమిపూజ కార్యక్రమానికి గుర్తుగా ఆదిలాబాద్ పట్టణం కుమ్మరికుంట కాలనీలో హనుమాన్ విగ్రహ ఏర్పాటునకు ఆయన భూమిపూజ చేశారు.
ఇకపై జైశ్రీరామ్ అంటూ నమస్కారం చేసుకోవాలి: ఎంపీ సోయం - ఆదిలాబాద్లో భారీ హనుమాన్ విగ్రహ పూజ
అయోధ్యలో భూమిపూజ కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందగిన రోజుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అభివర్ణించారు. ఆదిలాబాద్ పట్టణంలో భారీ హనుమాన్ విగ్రహ ఏర్పాటునకు ఆయన భూమిపూజ చేశారు.
ఇకపై జైశ్రీరామ్ అంటూ నమస్కారం చేసుకోవాలి: ఎంపీ సోయం
రామరాజ్యంలో రాముడు ఏవిధంగా పాలన సాగించారో.. అదేమాదిరిగా మోదీ మన దేశంలో రామపాలన సాగిస్తున్నారని ఎంపీ కొనియాడారు. ఇకముందు ప్రతి ఒక్కరూ జైశ్రీరాం అంటూ నమస్కారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!
TAGGED:
latest news of adilabad