తెలంగాణ

telangana

ETV Bharat / state

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం - భారీ వాహనం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై ఓ భారీ లారీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ భారీ లారీకి 365 చక్రాలు ఉన్నాయి. అది హైదరాబాద్ చేరుకోవడానికి 5 నెలలు పడుతుంది.

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం

By

Published : Aug 12, 2019, 4:01 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై భారీ లారీ ఆకట్టుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ పరిశ్రమలకు భారీ యంత్ర సామగ్రిని తీసుకెళ్తున్న లారీని స్థానికులు ఆశ్చర్యంలో చూశారు. 365 చక్రాలు, ఉన్నాయని హైదరాబాద్ చేరుకోవడానికి 5 నెలల సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు. రవాణా కోసం దాదాపు 45 మంది సిబ్బంది, ఇతర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎస్కార్ట్ వాహనం ఉంది. లారీ మరమ్మతులకు మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు.

365 చక్రాలు.. ఐదు నెలల ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details