ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఐసీడీఎస్ కార్యాలయం నుంచి కుమురంభీం ప్రాంగణం వరకు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
'ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు' - ఆదిలాబాద్ తాజా వార్త
ప్రతి తల్లి తన ఆడబిడ్డను చిన్న చూపు చూడకుండా కొడుకుతో సమానంగా ఉన్నత చదువులు చదివించి వారి ఎదుగుదలకు శ్రమించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఉట్నూర్‌లో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
'ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు'
అనంతరం సమావేశ మందిరంలో అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఆయా మండలాలకు చెందిన పలువురు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లను చిన్నచూపు చూడడం భావ్యం కాదని ఆమెను కూడా కొడుకుతో సమానంగా పెంచాలని డాక్టర్ మనోహర్ సూచించారు. సీడబ్ల్యూసీ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.