Bandi sanjay praja sangrama yatra: నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ దిలార్వార్పూర్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికంగా ఉన్న పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితులున్నాయో.. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చినా కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి అందలేదు, రుణమాఫీ కాలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, స్వర్ణకారులు, చేనేత కార్మికులు సహా చేతి వృత్తులు చేసే వారి ఆకలి చావులు కొనసాగుతూనే.. ఉన్నాయని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏమి సాధించిందో చెప్పాలని.. డిమాండ్ చేశారు.