ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి.. సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై ఆశా కార్యాకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ఆందోళన, అరెస్ట్ - asha workers arrest at adilabad collectorate
కరోనా సమయంలో వైద్యులతో సమానంగా పనిచేస్తున్న తమకు ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు
కరోనా సమయంలోనూ తాము ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్నామని ఆశా కార్యకర్తలు తెలిపారు. తమకు ఇన్సెంటివ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కేటాయిస్తున్నట్లు నెలకు రూ. 10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
TAGGED:
ఆశా కార్యకర్తల అరెస్ట్