ఆదిలాబాద్ జిల్లాలో పోషణ పక్ష వారోత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార మేళాలు నిర్వహిస్తున్నారు. పోషక విలువలు కలిగిన వంటకాలు తయారు చేసి ప్రదర్శనకు పెడుతున్నారు. ఒక్కో వంటకాన్ని పరిచయం చేస్తూ వాటి వల్ల కలిగే లాభాలు వివరిస్తున్నారు.
కలెక్టరేట్లో పోషక వంటకాలతో ఫుడ్ మేళా - adilabad collectorate
పోషణ పక్ష వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారమేళ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రకాల వంటకాలతో ప్రదర్శన నిర్వహించారు.
కలెక్టరేట్లో పోషక వంటకాలతో ఫుడ్ మేళా
జిల్లా కలెక్టరేట్లో పట్టణ అంగన్వాడీ కార్యకర్తలంతా కలిసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ మిల్కా సందర్శించి ఆయా వంటకాలు రుచి చూశారు.
ఇవీ చూడండి:అప్రమత్తంగా ఉన్నా.. ఆందోళన తగ్గట్లే!