ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పట్టణంలోని కొలాం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరాతీశారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. ఇరుకైన గదులు, విద్యార్థులు కొందరు జ్వరంతో ఉండటం.. అపరిశుభ్రత నెలకొనడం పట్ల ప్రధానోపాధ్యాయుడిపై అసహనం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో వసతులు కల్పించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ ఉన్నారు.
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా జడ్జీ
ఆదిలాబాద్ పట్టణంలోని కొలాం ఆశ్రమ పాఠశాలను జిల్లా జడ్జీ ప్రియదర్శిని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా జడ్జీ