ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 6 నుంచి పత్తికొనుగోళ్లు ప్రారంభిస్తామని కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు. రైతులు, వ్యాపారులు, అధికారులతో పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కనీస మద్దతు ధర కంటే పత్తి ధర బయట తక్కువ పలుకుతోందని, రైతులు సీసీఐకే విక్రయించేందుకు మొగ్గుచూపాలని సూచించారు.
అడవుల జిల్లాలో పత్తి కొనుగోలుకు ముహూర్తం ఖరారు - ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్
ఎట్టకేలకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తికొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 6 నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ తెలిపారు.
ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు
తేమ శాతం 8-12 శాతం లోపు ఉండేలా పత్తిని ఆరబెట్టుకుని యార్డుకు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. జిల్లాలో పండే పత్తి నాణ్యత బాగా ఉంటుందని వెల్లడించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలని వ్యాపారులకు హితవు పలికారు.
- ఇదీ చూడండి : చెట్టు ఎక్కి చిక్కాడు.. 'దళం' సాయంతో దిగాడు