గణేశ్ నిమజ్జనంపై ఓ భక్తుడి కవిత
కొవిడ్ నిబంధనల కారణంగా మెట్టమొదటి సారిగా నిరాడంబరంగా, డీజే చప్పుళ్లు లేక, యువకుల నృత్యాలు లేక, 4 గంటల్లో సాదాసీదాగా వినాయక నిమజ్జనం ముగిసింది. నిమజ్జనంపై ఓ భక్తుడు రాసుకున్న కవిత....
మట్టితో చేశాము ..మనసు పెట్టి పూజించాము
ఎత్తైన విగ్రహాలు పెట్టలేదు
ఆర్భాటాలు అలంకరణలు చేయలేదు
డప్పుల చప్పుల్లు లేవు
డీజేల హోరు లేదు
దారులెంట డ్యాన్సుల్లేవు
భూరలమ్మే వారేలేరు
బుగ్గలమ్మే వారి జాడేలేదు
చిరువ్యాపారులంతా
చిన్నబోయి చూస్తున్నారు
ఇంటిపైకప్పుపై కూర్చోని
ఆసక్తిగా చూసే అమ్మలక్కల ఊసేలేదు
మనసంతా ఉల్లాసమున్నా
మనుషుల్లో సంతోషాల్లేవు
చిన్నారుల్లో అలకలు
పెద్దవారిలో అసంతృప్తులు
అయినా..... గణపయ్యా...
భక్తిశ్రద్దలతో కదిలాము
భజన చేస్తూ నీ వెంట నడిచాము
కరోనా నీకు కనికరం లేదన్నారు
కాని కష్టమనుకున్నా ఆచారాన్ని
మాతో ఇష్టంగా చేయించావుగా...