ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాజేశ్వర్ రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది దివ్యాంగుల నుంచి సదరన్ ధ్రువపత్రాలకై దరఖాస్తులను స్వీకరించారు.
దివ్యాంగుల కోసం సదరం శిబిరం - బోథ్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు మూడు వేల మంది దివ్యాంగులు హాజరయ్యారు. సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డామని దివ్యాంగులు తెలిపారు.
దివ్యాంగుల కోసం సదరం శిబిరం
తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు ఎక్కువగా రావడం వల్ల సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, సిరికొండ మండలాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా