కవులు చేస్తున్న కృషి అభినందనీయమని వారు రాసిన రచించిన పుస్తకాలు చిరకాలం ఉంటాయని ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో కొండ గుర్ల లక్ష్మయ్య రచించిన 'బతుకుచిత్రం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కవులు, కళాకారులు, రచయితలు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. వారు రాసిన రచనలు చిరస్థాయిగా దేశవ్యాప్తంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
కవులు చేస్తున్న కృషి అభినందనీయం - aadilabad district latest news
సమాజంలో కవులు, రచయితలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ కొనియాడారు. కొండ గుర్ల లక్ష్మయ్య రచించిన బతుకు చిత్రం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన వారు రాసే పుస్తకాలు సమాజానికి ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు.
కవులు చేస్తున్న కృషి అభినందనీయం
సాహితీ వేదిక ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రజల జీవన స్థితిగతులపై, ఆచార వ్యవహారాలపై, ప్రస్తుత కాలంలో నడుస్తున్న జీవన విధానాలపై రాస్తున్న పుస్తకాలు.. రానున్న తరాల వారికి, నేటి సమాజానికి దోహద పడతాయని జనార్దన్ వెల్లడించారు. రచయిత లక్ష్మయ్యని సాహితీ వేదిక కమిటీ సభ్యులతో కలిసి ఉట్నూర్ ఎంపీపీ జయవంత్రావు ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి:'నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే'