ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం వల్ల మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలలో పిడుగుపాటుకు మందుల రాము అనే రైతుకు చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
సుమారు లక్షా యాభై వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈదురు గాలులకు గార్ల, బయ్యారం మండలాల్లో పలు ఇళ్లపై కప్పులు లేచిపోయాయి.
పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి - GUDUR MANDAL
అకాల వర్షం పడటం వల్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చోటు చేసుకుంది. పలు ఇళ్లపై వేసిన రేకుల షెడ్డులు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి.
25 గొర్రెలు మృత్యువాత
ఇవీ చూడండి : ఐపీఎల్ ఫైనల్కు ఉప్పల్ స్టేడియం సిద్ధం