ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చెమ్మన్‌గూడలో 20 మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. బాధితుల్లో రెండు నుంచి ఎనమిదేళ్ల వయస్సున్నా.... 8 మంది చిన్నారులు ఉన్నారు. గ్రామానికి చెందిన ఒక్కొక్కరు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. మరికొంతమందికి గ్రామంలోనే వైద్యం అందిస్తున్నారు. కలుషిత నీరుతాగడంతోనే అస్వస్థతకు గురయ్యారా.. లేక మంగళవారం జరిగిన కేశఖండనంలోని విందు భోజనం విషతుల్యమైందా.. అనేది తెలియాల్సి ఉంది.
20 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స - water
ఆదిలాబాద్ జిల్లా చెమ్మన్‌గూడలో 20 మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఇందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
20 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స