తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: టెన్నిస్​, బ్యాడ్మింటన్​లో శుభారంభం.. హాకీలో నిరాశ

Tokyo olympics live page
ఒలింపిక్స్

By

Published : Jul 24, 2021, 6:29 AM IST

Updated : Jul 24, 2021, 6:43 PM IST

18:36 July 24

హాకీలో నిరాశ...

ఒలింపిక్స్​లో భాగంగా మహిళల హాకీలో భారత్​ శుభారంభం చేయలేకపోయింది. నెథర్లాండ్స్​తో జరిగిన పోరులో విఫలమైంది. 5-1తో ఆ జట్టుపై భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. మ్యాచ్​ ప్రారంభంలో నెథర్లాండ్స్​కు గట్టిపోటీనిచ్చిన మహిళ జట్టు.. చివరి 30 నిమిషాల్లో చేతులెత్తేసింది. 2-1తో వెనకంజలో ఉన్నప్పటికీ, స్కోర్లను సమం చేస్తుందనే నమ్మకం అభిమానులకు కలిగింది. కానీ చివరికి 5-1తో ఓడిపోయింది.

16:23 July 24

బాక్సింగ్​లో డీలా..

టోక్యో ఒలింపిక్స్​ బాక్సింగ్​ పోటీల్లో వికాశ్​ కృష్ణన్​ డీలాపడ్డాడు. పురుషుల 69 కేజీల విభాగంలో గ్రూప్​ దశలోనే ఓడిపోయాడు. వికాశ్​పై జపాన్​కు చెందిన ఒకజావా గెలుపొందాడు.

13:02 July 24

టేబుల్​ టెన్నిస్​లో మనికా బత్రా విజయం..

టేబుల్​ టెన్నిస్​ మహిళల సింగిల్స్​ తొలి రౌండ్​లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్​ బ్రిటన్​ క్రీడాకారిణిపై నాలుగు వరుస గేమ్​ల్లో గెలిచింది. 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో చిత్తు చేసింది. 

అంతకుముందు టేబుల్​ టెన్నిస్​ మిక్స్​డ్​ డబుల్స్​లో శరత్​ కమల్​తో కలిసి ఆడిన మనికా.. చైనీస్​ తైపీ చేతిలో పరాజయం పాలైంది. 

12:29 July 24

షూటింగ్​లో మళ్లీ నిరాశే..

షూటింగ్​ పురుషుల 10. మీ. ఎయిర్​ పిస్టల్​ విభాగంలో భారత్​కు నిరాశే ఎదురైంది. ఫైనల్​లో మెరుగైన ప్రదర్శన చేయని సౌరభ్​ చౌదరీ.. 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వాలిఫికేషన్స్​లో సౌరభ్​.. అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. 

12:17 July 24

టోక్యో ఒలింపిక్స్​లో తొలి పతకం

ఈసారి ఒలింపిక్స్​లో భారత్ తొలి పతకం సొంతం చేసుకుంది. 49 కిలోల వెయిట్​ లిఫ్టింగ్​ పోటీలో భారత మహిళ క్రీడాకారిణి మీరాబాయి చాను రజతం అందుకుంది. చైనా వెయిట్ లిఫ్టర్ హో జిహ్యూయి స్వర్ణం సాధించింది. ఇండోనేసియాకు కాంస్యం దక్కింది. 

12:01 July 24

సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి విజయం

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్​లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్​శెట్టి అదరగొట్టింది. చైనీస్ తైపీ జట్టుపై 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో విజయం సాధించింది.

11:47 July 24

రెండో రౌండ్​కు సుమిత్​ నగాల్​

భారత టెన్నిస్​ యువ కెరటం సుమిత్​ నగాల్​ అదరగొట్టాడు. తొలి రౌండ్​లో ఉజ్బెకిస్థాన్​కు చెందిన డెనిస్​ ఇస్తోమిన్​పై 6-4, 6-7, 6-4 తేడాతో గెలిచి రెండో రౌండ్​కు అర్హత సాధించాడు. 

11:20 July 24

ఆర్చరీ మిక్స్​డ్ టీంలోనూ ఓటమి.. 

ఆర్చరీ మిక్స్​డ్ టీం​ ఈవెంట్​లోనూ భారత్ ఓటమిపాలైంది. క్వార్టర్స్​లో కొరియా చేతిలో 6-2 తేడాతో ఓడి, ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది.

11:00 July 24

సాయిప్రణీత్ ఓటమి..

భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ తన ఒలింపిక్స్​ తొలి గేమ్​లోనే నిరాశపరిచాడు. ఇజ్రాయెల్​కు చెందిన జిల్బర్​మన్ చేతిలో 17-21, 15-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు.

తరువాతి గేమ్​లో 29వ ర్యాంక్​ షట్లర్​ మార్క్​తో తలపడనున్నాడు. 

10:42 July 24

సౌరభ్ చౌదరి

షూటింగ్​ క్వాలిఫికేషన్​లో భారత్​ ధమాకా

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్​ రౌండ్​లో భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి అదరగొట్టాడు. 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్​ రౌండ్​కు అర్హత సాధించాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ.. 17వ స్థానంలో నిలిచి, పోటీ నుంచి నిష్క్రమించాడు.

మరికొద్ది సేపట్లో ఫైనల్​ ప్రారంభం కానుంది. మొత్తం 8 మంది ఫైనల్​లో తలపడనున్నారు. 

09:12 July 24

టేబుల్​ టెన్నిస్​లో ఓటమి..

టేబుల్ టెన్నిస్​లో మిక్స్​డ్ డబుల్స్​లో భారత ద్వయం మనికా బత్రా-శరత్ కమల్ నిరాశపరిచారు. చైనీస్ తైపీ చేతిలో 4-0 తేడాతో ఘోరంగా ఓడిపోయారు. 

08:42 July 24

సుశీలా దేవి ఓటమి

భారత్​ తరఫున 48 కిలోల విభాగంలో పోటీపడిన జుడో ప్లేయర్ సుశీలా దేవి.. ఎవా సెర్నోవిక్జీ చేతిలో ఓడింది. దీంతో జుడోలో భారత ప్రయాణం ముగిసింది.

08:30 July 24

.

హాకీలో భారత్​ బోణీ..

హాకీ మ్యాచ్​లో భారత పురుషుల జట్టు మెప్పించింది. పూల్​-ఏ మ్యాచ్​లో న్యూజిలాండ్​పై 3-2 తేడాతో విజయం సాధించింది. హర్మన్​ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ కొట్టగా, రూపిందర్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ కొట్టి ఆకట్టుకున్నారు. 

తదుపరి మ్యాచ్​ ఆస్ట్రేలియాతో జులై 25న ఆడనుంది. 

06:11 July 24

ఒలింపిక్స్​లో భారత వేట మొదలైంది. శనివారం జరిగిన పోటీల్లో భారత ఆర్చరీ జట్టు శుభారంభం చేసింది. మిక్స్​డ్ టీమ్ విభాగంలో దీపికా కుమారి- ప్రవీణ్​ జాదవ్​ జోడీ.. చైనీస్​ తైపీపై 5-3 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్​కు అర్హత సాధించింది.

షూటింగ్​లో నిరాశే..

షూటింగ్​లో మహిళల 10.మీ ఎయిర్​ రైఫిల్​ విభాగంలో భారత క్రీడాకారులు నిరాశపర్చారు. అపూర్వి చండేలా, ఎలవెనిల్​ వలరివన్​ ఫైనల్​కు అర్హత సాధించలేకపోయారు. 

Last Updated : Jul 24, 2021, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details