టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్-జె తొలి మ్యాచ్‌లో ఆరో సీడ్‌గా బరిలో దిగిన తెలుగు తేజం.. ఇజ్రాయెల్‌కు చెందిన 58వ ర్యాంక్ పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ 28 నిమిషాల్లోనే ముగియడం విశేషం.
తన రెండో మ్యాచ్‌ను హాంకాంగ్‌కు చెందిన ప్రపంచ నెం.34 చెంగ్ నాన్ యితో(Cheung Ngan Yi) ఆడనుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఈసారి కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగింది.