అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మహిళల బ్యాలన్స్ బీమ్ ఫైనల్ విభాగంలో కాంస్య పతకం గెలుపొందింది. 14.000 స్కోరు సాధించిన బైల్స్ బ్రాంజ్‌తో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్లు గుహన్ చెంచెన్ స్వర్ణం గెలువగా, తంగ్ గ్జింజింగ్ వెండితో మెరిసింది.
ఆరింట్లో ఒక్కటే..
రియో గేమ్స్‌లో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన రికార్డును.. బైల్స్ టోక్యో ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆరు ఈవెంట్లలో బరిలో నిలిచింది. కానీ ఆమె అనూహ్యంగా మానసిక సమస్య 'ట్విస్టీస్' వల్ల వరుసగా ఈవెంట్స్ నుంచి తప్పుకుంది. ఇటీవలే టీమ్ ఈవెంట్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఈవెంట్ ఫైనల్స్, వాల్ట్, అన్ ఈవెన్ బార్స్ ఫైనల్స్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్‌కు దూరమైంది.
ఇదీ చదవండి:Lovlina Borgohain: 'సెమీస్‌లో గెలుస్తా.. సరికొత్త రికార్డు సృష్టిస్తా'