ఒలింపిక్స్‌లో గురువారం.. భారత్ జోరు చూపించింది. అన్ని క్రీడల్లో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. హాకీ పూల్-ఏ లో మెరుగైన స్థానంతో టీమ్ ఇండియా క్వార్టర్ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో సతీశ్ కుమార్ క్వార్టర్స్‌కు చేరారు. ఆర్చరీలో పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్.. ప్రీక్వార్టర్స్ చేరాడు. షూటింగ్ మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో తొలి క్వాలిఫికేషన్ ప్రెసిషన్ రౌండ్లో మను బాకర్ ఐదో(5వ) స్థానంలో నిలిచింది. మరో షూటర్.. రహి సర్నోబత్ 25వ స్థానంలో ఉంది. వీరు శుక్రవారం జరిగే ర్యాపిడ్ ఫైర్‌లోనూ (క్వాలిఫికేషన్-స్టేజీ 2) తలపడాల్సి ఉంటుంది.
మొత్తంగా టాప్-8లో నిలిచిన షూటర్లు.. మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు.
సింధుతో మొదలు..
గురువారం.. భారత్ దూకుడు షట్లర్ పీవీ సింధుతోనే ప్రారంభమైంది. ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకంపై గురిపెట్టిన స్టార్ షట్లర్.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిక్ఫెల్ట్ను వరుస సెట్లలో చిత్తు చేసింది.
మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13 తేడాతో గెలిచింది. క్వార్టర్స్‌లో సింధు.. జపాన్ షట్లర్ అకానె యమగూచితో ఆడనుంది.
హాకీలో జోరు..
హాకీలోనూ భారత్ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో మెన్ ఇన్ బ్లూకు క్వార్టర్ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే.
పూల్ ఏలోని ఆరింట్లో.. నాలుగు జట్లు క్వార్టర్స్‌కు చేరుతాయి. ప్రస్తుతం 3 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది.
చివరి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది మన్‌ప్రీత్ సేన.
చివరి 2 నిమిషాల్లో 2 గోల్స్..
తొలి రెండు క్వార్టర్స్ గోల్స్ లేకుండానే ముగిసింది. మూడో క్వార్టర్లో 43వ నిమిషంలో కుమార్ వరుణ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. వివేక్ సాగర్ ప్రసాద్(58వ), హర్మన్ ప్రీత్ సింగ్(59వ) నిమిషాల్లో గోల్స్ చేసి భారత్ ఆధిపత్యాన్ని 3-1కి పెంచారు. అర్జెంటీనాకు ఏకైక గోల్ 48వ నిమిషంలో.. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చింది.
ఇదీ చూడండి: Olympics: కొలనులో కొత్త చేప
ఛాంపియన్‌కు షాక్ ఇచ్చిన అతాను..