టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్డా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి బాగా జ్వరం వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు స్నేహితులు, కుటుంబసభ్యులు తెలిపారు.
ఒలింపిక్స్ తర్వాత తొలిసారి మంగళవారం దిల్లీ నుంచి హరియాణా పానిపట్ సమీపంలోని తన స్వగ్రామమైన సమల్ఖాకు భారీ ఉరేగింపుతో బయల్దేరాడు నీరజ్. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అతడిపై పూల వర్షం కురిపించారు. దారిపొడవునా కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూనే ఉన్నాడు నీరజ్. దీంతో దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ యాత్రలో నీరసించిపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఊరేగింపు చివరి వరకు కూడా ఉండలేకు మార్గ మధ్యలోనే తప్పుకొన్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.