టోక్యోలో ఒలింపిక్స్‌లో ఆసక్తికర విషయం కనిపించింది. బుధవారం జరిగిన సింక్రనైజింగ్ స్విమ్మింగ్ పోటీలో ఇజ్రాయెల్‌కు చెందిన స్విమ్మర్లు బాలీవుడ్ పాటతో ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 'ఆజా నచ్‌లే' చిత్రంలోని ఆజా నచ్‌లే పాటకు అనుగుణంగా ఇజ్రాయెల్ అథ్లెట్లు ఈడెన్ బ్లెచర్, షెల్లీ బాబ్రిస్కీ ఇద్దరూ జంటగా స్విమ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న భారతీయులు ఇజ్రాయెల్ అథ్లెట్లు బాలీవుడ్ పాటను ఎంచుకోవడం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బాలీవుడ్ పాటతో వారు చేస్తున్న ప్రదర్శనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
Olympics: హిందీ పాటతో ఇజ్రాయెల్ స్విమ్మర్ల ప్రదర్శన - మాధురీ దీక్షిత్
ఒలింపిక్స్‌లో ఆసక్తికర దృశ్యం నెటిజన్లను అలరిస్తోంది. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ 'ఆజా నచ్‌లే' హిందీ పాటకు స్విమ్మింగ్ చేసి ఆకట్టుకున్నారు ఇజ్రాయెల్ స్విమ్మర్లు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇజ్రాయెల్ స్విమ్మర్లు
ఇజ్రాయెల్ ఇన్ ఇండియా అనే ట్విటర్ పేజీ ఈ వీడియోను షేర్ చేస్తూ.. "బాలీవుడ్ సినిమాలంటే ఇజ్రాయెల్‌కు ఎంతో ఇష్టం. మా ఒలింపిక్స్ స్విమ్మర్లు ఆజా నచ్‌లే పాటతో పోటీలో పాల్గొనడమే అందుకు నిదర్శనం"అని పేర్కొంది. అయితే, ఈ పోటీల్లో వారిద్దరు ఫైనల్‌కు చేరుకోలేకపోయినా భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. మీరూ ఆ వీడియో చూసేయండి!
ఇవీ చదవండి: