Olympics: బాక్సింగ్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన మేరీ కోమ్ - మేరీకోమ్ వయసు?
13:55 July 25
Olympics: పంచ్ పడింది.. బాక్సింగ్ ప్రిక్వార్టర్స్‌లో మేరీ కోమ్
భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆమె ప్రి క్వార్టర్స్‌కి దూసుకెళ్లింది. 51 కిలోల విభాగంలో తలపడిన మేరీ.. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. డొమినికాకు చెందిన గార్సియాపై 4-1 తేడాతో విజయం సాధించింది.
ప్రత్యర్థి రెండో రౌండ్లో పైచేయి సాధించినప్పటికీ తన అనుభవంతో బౌట్‌ను మూడు నిమిషాల్లోనే సునాయాసంగా చేధించింది.
కొలంబియా క్రీడాకారిణి, 2016 రియో ఒలింపిక్ పతక విజేత(కాంస్యం) ఇంగ్రిట్ వాలెన్సియాతో ఈ నెల 29న తలపడనుంది.