స్విమ్మింగ్‌లోనూ..
స్విమ్మింగ్లోను భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల 100మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 2లో సాజన్ ప్రకాశ్ ఓటమిపాలయ్యాడు.
19:50 July 29
స్విమ్మింగ్‌లోనూ..
స్విమ్మింగ్లోను భారత్‌కు నిరాశ తప్పలేదు. పురుషుల 100మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 2లో సాజన్ ప్రకాశ్ ఓటమిపాలయ్యాడు.
16:09 July 29
బాక్సింగ్‌లో నిరాశ.. ప్రీక్వార్టర్స్‌లో మేరీకోమ్ ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్య పరిణామం! భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రీకార్టర్స్‌లో ఓటమిపాలైంది. మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్ వాలెన్సియాతో జరిగిన పోరులో ఓడిపోయింది. ఫలితంగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
ఈసారి ఒలింపిక్స్ పతకంపై భారత్ ఆశలు పెట్టుకున్న అథ్లెట్లలో మెరీకోమ్ పేరు ముందు వరుసలో ఉంది. గత మ్యాచ్‌లో విజయం సాధించి జోరు మీద కనిపించిన మేరీకోమ్.. ఈ మ్యాచ్‌లోనూ గెలుస్తుందని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అభిమానులను నిరాశపరుస్తూ క్వార్టర్స్‌కు కూడా ఆర్హత సాధించలేకపోయింది.
09:00 July 29
బాక్సింగ్‌లో మరో విజయం..
ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో భారత ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే తమ తమ విభాగాల్లో మేరీకోమ్ ప్రీక్వార్టర్స్, పూజారాణి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా.. ఇప్పుడు పురుషుల సూపర్ హెవీ (91 కేజీలు+) విభాగంలో సతీశ్ కుమార్ నాకౌట్ చేరాడు. జమైకాకు చెందిన రికర్డో బ్రౌన్‌ను 4-1 తేాడాతో ఓడించాడు సతీశ్.
ఆగస్టు 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్.. జలలోవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
08:32 July 29
ప్రీక్వార్టర్స్‌లో అతాను దాస్..
భారత ఆర్చర్ అతాను దాస్.. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 1/32 ఎలిమినేషన్స్‌లో చైనీస్ తైపీకి చెందిన డెంగ్ యు- చెంగ్‌ను 6-4 తేడాతో ఓడించిన అతాను.. తర్వాతి మ్యాచ్‌లో దక్షిణ కొరియా టాప్ ప్లేయర్ ఓ జిన్ హయక్పై షూట్-ఆఫ్‌లో నెగ్గి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
ఓ జిన్.. రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ కావడం విశేషం.
ఈ మ్యాచ్ ఆద్యతం హోరాహోరీగా సాగింది. తొలి సెట్ ఓ జిన్ నెగ్గి 2 పాయింట్లు సాధించాడు. తర్వాతి రెండు సెట్లు టై అవ్వగా.. జిన్ 4, అతాను 2 పాయింట్లతో నిలిచారు. తర్వాతి సెట్ అతాను నెగ్గగా 4-4తో స్కోరు సమమైంది. మళ్లీ ఐదో సెట్ టై అయింది. 5-5తో నిలిచారు. షూట్-ఆఫ్‌లో ఓ జిన్ 9 స్కోరు చేయగా.. అతాను బాణం గురి తప్పలేదు. 10 పాయింట్లు సాధించి.. మ్యాచ్ గెలిచాడు.
07:51 July 29
అతాన్ దాస్ విజయం..
ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. 1/32 ఎలిమినేషన్స్‌లో చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 6-4 తేడాతో గెలిచాడు. తర్వాతి మ్యాచ్‌లో కొరియా ఆర్చర్‌తో పోటీ పడనున్నాడు.
07:51 July 29
హాకీలో జోరు..
ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు మరో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 3-1 తేడాతో చిత్తు చేసింది. నాలుగో క్వార్టర్స్‌లో 2 గోల్స్‌తో అదరగొట్టింది భారత్. పూల్ ఏలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచింది టీమ్ ఇండియా. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.
06:50 July 29
క్వార్టర్స్‌లోకి సింధు..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్ షట్లర్ మియా బ్లిక్ఫెల్ట్ను వరుస సెట్లలో ఓడించింది.
21-15, 21-13 తేడాతో ఓడించింది. మ్యాచ్ మొత్తం దూకుడైన ఆట ప్రదర్శించింది తెలుగు తేజం.
క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే కనీసం కాంస్యం సాధించే అవకాశముంది.
06:34 July 29
హాకీ..
ఒలింపిక్స్‌లో దూకుడు ప్రదర్శిస్తున్న భారత హాకీ టీం.. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో నిలకడగా ఆడుతోంది. తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఉన్నాయి ఇరుజట్లు.
06:31 July 29
షూటింగ్లో..
షూటింగ్ మహిళల 25. మీ. పిస్టల్ విభాగంలో రహి సర్నోబత్.. క్వాలిపికేషన్ ప్రెసిషన్ స్టేజీలో 10 మందిలో ఏడో స్థానంలో నిలిచింది. మరో స్టార్ షూటర్ మను బాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది.
06:30 July 29
సింధు దూకుడు..
బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్స్‌లో 12వ ర్యాంకర్ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో (డెన్మార్క్) తలపడుతోంది పీవీ సింధు.
06:09 July 29
Olympics Live: రోయింగ్‌లో మెరుగైన ప్రదర్శన- సింధు దూకుడు
రోయింగ్ లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్‌లో భారత జోడీ (అర్జున్- అర్వింద్) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫైనల్ బిలో.. ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా... 11వ స్థానంతో టోర్నీని ముగించారు. ఒలింపిక్స్ రోయింగ్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.