తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా ధాటికి టెన్నిస్​ టోర్నీలన్నీ బంద్​ - టెన్నిస్​ టోర్నమెంట్లు

మహమ్మారి కరోనా క్రీడా రంగాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ వైరస్​ దెబ్బకు ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇందువల్ల క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా పురుషులు, మహిళలకు సంబంధించిన అన్ని టెన్నిస్​ టోర్నమెంట్​లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి ఏటీపీ, డబ్ల్యూటీఏ.

WTA, ATP call off season till June 7 due to coronavirus
కరోనా ధాటికి టెన్నిస్​ టోర్నమెంట్లూ వాయిదా

By

Published : Mar 19, 2020, 4:01 PM IST

కరోనా వైరస్​ దెబ్బకు క్రీడా రంగం కుదేలైపోయింది. ఇప్పటికే పలు టోర్నీలు నెలల పాటు వాయిదా పడగా... తాజాగా టెన్నిస్​ పైనా కొవిడ్​-19 ప్రభావం పడింది. పురుషులు, మహిళలకు సంబంధించిన అన్ని టెన్నిస్​ టోర్నమెంట్లు జూన్​ 7వ తేదీ వరకు నిలిపివేశారు. గతంలో రూపొందించిన షెడ్యూల్ ప్రకారం క్రీడలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రకటించాయి ఏటీపీ, డబ్ల్యూటీఏ. త్వరలో ప్రారంభమవ్వాల్సిన ఫ్రెంచ్​ ఓపెన్​నూ మే నుంచి సెప్టెంబరుకు వాయిదా వేశారు. ఏప్రిల్​ చివరి వరకు అన్ని పర్యటనలు రద్దు చేశారు. ఇది మే వరకు పెంచే అవకాశం ఉంది.

కరోనా ధాటికి టెన్నిస్​ టోర్నమెంట్లూ వాయిదా

ఆ దేశాల్లోనూ..

త్వరలో స్ట్రాస్బర్గ్​, ఫ్రాన్స్​, రబాట్​, మొరాకోలలో జరగనున్న డబ్ల్యూటీఏ టోర్నీలతో పాటు.. మ్యూనిచ్​, ఎస్టోరిల్​, పోర్చుగల్​, జెనీవా, లియోన్​, ఫ్రాన్స్​లో జరగనున్న ఏటీపీ కార్యక్రమాలు రద్దయ్యాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు అన్ని క్రీడలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భారత జట్టు విలువైన ఆస్తి ధోనీ: జాఫర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details