తెలంగాణ

telangana

ETV Bharat / sports

NAOMI OSAKA: రికార్డు సంపాదన.. అథ్లెట్లలో అగ్రస్థానానికి - టెన్నిస్ న్యూస్

ఓవైపు ఆటలో రాణిస్తూ, ట్రోఫీలు గెలుచుకుంటున్న టెన్నిస్ స్టార్ ఒసాకా.. సంపాదనలోనూ తిరుగులేదని నిరూపించింది. గత ఏడాది కాలంగా అత్యధిక మొత్తం సంపాదించిన మహిళా అథ్లెట్​గా ఘనత సాధించింది.

World No.2 tennis star Naomi earns record $55mn in 12 months
నవోమి ఒసాకా

By

Published : May 28, 2021, 9:16 AM IST

ప్రపంచ నం.2గా ఉన్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా.. 2020-21గానూ సంపాదనలో దూసుకెళ్లింది. ఏడాది కాలంలో అత్యధిక మొత్తం ఆర్జించిన మహిళా అథ్లెట్​గా నిలిచింది. ఈమె మొత్తం సంపాదన 55.2 మిలియన్ డాలర్లు కాగా, అందులో 5.2 మిలియన్​ డాలర్లు ప్రైజ్​మనీ కింద అందుకుంది.

గతేడాది యూఎస్​ ఓపెన్, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్​లో ఒసాకా విజేతగా నిలిచింది. 'బ్లాక్ లైవ్స్' ఉద్యమానికి గత కొద్దికాలం నుంచి ఈమె బహిరంగంగానే మద్దతు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం రెండు డజన్లకు పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

నవోమి ఒసాకా

త్వరలో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్ సందర్భంగా మీడియాతో మాట్లాడనని జపాన్ ఒసాకా ప్రకటించింది. ప్లేయర్ల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారని, అందుకే మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

ఇది చదవండి:serena williams: సెరెనా '24'వ టైటిల్ కల నెరవేరుతుందా?

ABOUT THE AUTHOR

...view details