తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon: గ్రాండ్​స్లామ్​ క్వార్టర్స్​లో జకోవిచ్​ 50వసారి - జకోవిచ్​ లేటెస్ట్​ అప్టేట్స్​

టెన్నిస్ స్టార్ ప్లేయర్​ నొవాక్ జకోవిచ్(Novak Djokovic)​ వింబుల్డన్​ క్వార్టర్​ ఫైనల్​లోకి ప్రవేశించాడు. 6-2,6-4,6-2తేడాతో క్రిస్టియన్​ గారిన్​ను ఓడించాడు. ఇంకా పలువురు ఆటగాళ్లు ఈ రౌండ్​కు తొలిసారి చేరుకున్నారు.

Djokovic
జకోవిచ్​

By

Published : Jul 5, 2021, 10:36 PM IST

వింబుల్డన్​లో(Wimbledon)​ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌(Novak Djokovic) క్వార్టర్​ ఫైనల్​కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పోరులో 6-2, 6-4, 6-2 తేడాతో క్రిస్టియన్​ గారిన్​ను మట్టికరిపించాడు. ఈ టోర్నీలో క్వార్టర్స్​కు అతడు చేరుకోవడం ఇది 12వ సారి. ఇందు​లో గెలిస్తే సెమీఫైనల్​లో మార్టన్​(హంగేరియా) లేదా ఆండ్రే రుబ్లేవ్​(రష్యా)తో తలపడతాడు.

తొలిసారి క్వార్టర్​ఫైనల్​కు

మరోవైపు కరెన్​ ఖచనోవ్(Karen Khachanov)​ 3-6, 6-4, 6-3, 5-7, 10-8 తేడాతో సెబస్టియన్​ కోర్డాను(Sebastian Korda) ఓడించి ఈ రౌండ్​కు తొలిసారి చేరుకున్నాడు. తర్వాతి రౌండ్​లో డెనిస్​ షపొవాల్వొను ఎదుర్కొనున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన యాష్​ బార్టీ(Ash Barty) 7-5,6-3తేడాతో బార్బొరా క్రెజ్​కోవ్​ను(Barbora Krejckov ) ఓడించింది. ఇగా స్వియాటెక్​పై(Iga Swiatek) 5-7,6-1,6-1 తేడాతో ఆన్స్​ జాబిర్​(Ons Jabeur) గెలుపొందింది. అరినా సబలంకా చేతిలో 6-3,4-6,6-3,తేడాతో ఎలినా రిబకినా ఓటమి చెందింది.

ఇదీ చూడండి: నా కూతురికి 'తారా' పేరు అందుకే పెట్టా: జకోవిచ్​

ABOUT THE AUTHOR

...view details