తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్రాండ్​స్లామ్​లో ఓడినా అరుదైన రికార్డ్ సొంతం! - us open

యూఎస్​ ఓపెన్​ తొలి రౌండ్​లో ఫెదరర్​ చేతిలో ఓడిపోయాడు సుమిత్ నగల్. గ్రాండ్​స్లామ్​లో ఒక సెట్​ గెలిచిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు.

ఫెదరర్

By

Published : Aug 27, 2019, 2:35 PM IST

Updated : Sep 28, 2019, 11:23 AM IST

సుమిత్ నగల్​.. ఈ పేరు ప్రస్తుతానికి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ ఆటగాడికి మంచి భవిష్యత్​ ఉందని అంటున్నాడు టెన్నిస్ దిగ్గజం ఫెదరర్. అతి పిన్న వయసులో యూఎస్​ ఓపెన్​ మెయిన్ డ్రాకు అర్హత పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సుమిత్. తొలి రౌండ్​లో ఫెదరర్​తో తలపడి ఓటమిని చవిచూశాడు.

సుమిత్​పై ఫెదరర్​ 6-4, 1-6, 2-6, 4-6 తేడాతో విజయం సాధించాడు. మ్యాచ్​ అనంతరం మాట్లాడుతూ నగల్​ భవిష్యత్​లో గొప్ప ఆటగాడవుతాడని కితాబిచ్చాడీ టెన్నిస్ దిగ్గజం.

"సుమిత్​కు మంచి కెరీర్​ ఉంది. మొదటి సెట్​లో ఆశ్చర్యకరమైన ప్రదర్శన కనబర్చాడు. ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయడం వీలుకాదు. ఇలాంటి స్టేజిపై ఆడటం మరింత కష్టం. కానీ సుమిత్ బాగా ఆడాడు".
-ఫెదరర్​, టెన్నిస్ ఆటగాడు

ఆ ఘనత సాధించిన నాలుగో ఆటగాడు...

ఈ మ్యాచ్​లో తొలి సెట్​ను గెలిచిన సుమిత్ 20 ఏళ్లలో గ్రాండ్​స్లామ్​లో ఒక సెట్​ గెలిచిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అదీ ఫెదరర్ లాంటి దిగ్గజ ఆటగాడిపై గెలవడం మరో విశేషం. ఇది అతడికి 20 గ్రాండ్​ స్లామ్​లు గెలిచిన ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

సుమిత్ నగల్​ కంటే ముందు సోమ్​దేవ్ వర్మన్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేనీ.. గ్రాండ్​స్లామ్​లో ఒక సెట్​ గెలిచిన భారత టెన్నిస్ ఆటగాళ్లుగా ఘనత సాధించారు.

ఇవీ చూడండి.. కరీబియన్ సముద్రంలో భారత క్రికెటర్ల షికారు

Last Updated : Sep 28, 2019, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details