ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ ట్విట్టర్లో ప్రకటించాడు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో రోజర్ ఫెదరర్‌ను సమం చేసే అవకాశాన్ని వచ్చే ఏడాదికి నాదల్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
యూఎస్ ఓపెన్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
కరోనా కేసులు ఎక్కువవుతున్న ఇలాంటి సమయంలో ప్రయాణం చేయడం సరికాదని, అందుకే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు నాదల్ స్పష్టం చేశాడు.
కరోనా భయంతో యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్న నాదల్
"ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌పై ఇంకా నియంత్రణ రాలేదని అనిపిస్తుంది. ఈ సమయంలో యూఎస్ ఓపెన్ కోసం ప్రయాణం చేయలేను" అని నాదల్ రాసుకొచ్చాడు. ఇప్పటికే ఈ టోర్నీకి వెళ్లట్లేదని ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ నంబర్.1 ర్యాంకర్ యాష్ బార్టీ చెప్పింది.