యూఎస్ ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిక్ దూసుకుపోతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో అతడు వరుసగా మూడో రౌండ్లోనూ విజయం సాధించాడు. జర్మనీ ఆటగాడు జాన్ లెర్నడ్తో జరిగిన మ్యాచ్‌లో జకో 6-3, 6-3, 6-1 తేడాతో సునాయాసంగా గెలుపొందాడు. ఈ సీజన్లో ఈ సెర్బియా స్టార్‌కు ఇది వరుసగా 26వ గెలుపు.
యూఎస్ ఓపెన్: జకో దూకుడు..రెండో రౌండ్‌లో బోపన్న జోడీ - జకోవిక్ దూకుడు
యూఎస్ ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిక్ మూడో రౌండ్‌లో గెలుపొందాడు. అలాగే డబుల్స్‌లో ఇండో కెనడియన్ జోడీ రోహన్ బోపన్న-డెనిస్ షాపొవాలో ద్వయం రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకా నాలుగో రౌండ్‌కు చేరింది.
యూఎస్ ఓపెన్
పురుషుల డబుల్స్ విభాగంలో ఇండో కెనడియన్ జోడీ రోహన్ బోపన్న-డెనిస్ షాపొవాలో రెండో రౌండ్‌కు చేరుకుంది. వీరిద్దరూ అమెరికన్ జోడీ ఎర్నెస్టో, రూబిన్‌పై గెలుపొందారు. 6-2, 6-4 తేడాతో విజయం సాధించారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో నంబర్ వన్ క్రీడాకారిణి అయిన జపాన్ స్టార్ నవోమి ఒసాకా నాలుగో రౌండ్‌కు చేరింది. శుక్రవారం ఉక్రెయిన్ స్టార్ మార్తా కోస్త్యుక్‌తో తలపడిన మూడో రౌండ్‌లో 6-3, 6-7 (4), 6-2 తేడాతో ఒసాకా విజయం సాధించింది.