తన అందం, నటనతో టాలీవుడ్, బాలీవుడ్లో సత్తా చాటుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు వ్యాపార రంగంలోనూ అంతే ప్రత్యేకత చాటుతోంది. ఫిట్నెస్, స్పోర్ట్స్ అంటే ఆసక్తి చూపే రకుల్.. త్వరలో టెన్నిస్ వీక్షకుల గ్యాలరీలో సందడి చేయనుంది. గతంలో ఎఫ్ 45 పేరిట జిమ్‌లను హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ప్రారంభించింది. తాజాగా టెన్నిస్‌కు చెందిన ఓ జట్టును కొనుగోలు చేసింది.
టెన్నిస్‌లో అడుగుపెట్టిన రకుల్‌ప్రీత్ సింగ్..! - tollywood actress rakul preet singh co-owner to the finecab hyderabad strikers
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్... మరో వ్యాపారంలోకి అడుగుపెట్టేసింది. తాజాగా ఓ టెన్నిస్ ప్రాంఛైజీని సొంతం చేసుకుంది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టును కొనుగోలు చేసినట్లు ఆదివారం ప్రకటించింది.
టెన్నిస్‌లో అడుగుపెట్టిన రకుల్‌ప్రీత్ సింగ్..!
'ఫిన్క్యాబ్ హైదరాబాద్ స్టైకర్స్' జట్టుకు సహ యజమానురాలిగా ఉన్నట్లు చెప్పింది రకుల్. ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఈ భామ.. తన జట్టుకు చెందిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంది. ముంబయి వేదికగా డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరగనున్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)లో తన బృందం బరిలోకి దిగతుందని చెప్పుకొచ్చింది. టీపీఎల్ తొలి సీజన్‌కు గతంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ హాజరయ్యారు.