భారత్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగల్.. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 159వ స్థానంలో నిలిచాడు.
22 ఏళ్ల సుమిత్.. బంజూలుకా ఏటీపీ ఛాలెంజర్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతడిపై ఓ సెట్ గెలిచాడు.
టాప్-100లో కొనసాగుతున్న ప్రజ్నేశ్.. మూడు స్థానాలు ఎగబాకి 82వ స్థానం సొంతం చేసుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ మూడు స్థానాలు కోల్పోయి 179లో నిలిచాడు.