భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నెల 16న ఇరు జట్లు ప్రపంచకప్‌లో తలపడనుండగా.. కొన్ని ప్రకటనలను హల్చల్ చేస్తున్నాయి. ఈ యాడ్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ప్రకటనలు చికాకు తెప్పిస్తున్నాయంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.
"కొన్ని చికాకు తెప్పించే ప్రకటనలు ఇరు దేశాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సీరియస్‌గా చెబుతున్నాను.. చెత్త ప్రకటనలతో ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌కు మీరు హైప్ పెంచాల్సిన అవసరం లేదు. ఇక చాలు ఆపండి.. ఇది క్రికెట్ మాత్రమే. అంతకంటే ఎక్కువని మీరు భావిస్తుంటే.. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి" - సానియా ట్వీట్