తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2021, 10:26 PM IST

ETV Bharat / sports

షారుక్​, సంజయ్​దత్​ తర్వాత సానియాదే ఆ ఘనత

భారత్​ టెన్నిస్​ స్టార్ సానియాకు అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్​ స్టార్స్​ షారుక్​ ఖాన్​, సంజయ్​ దత్​ తర్వాత ఈ ఘనతను అందుకున్న మూడో వ్యక్తిగా ఈమె నిలిచింది. ఇంతకీ ఏంటి ఆ ఘనత?

sania
సానియా

భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జాకు దుబాయ్​ 'గోల్డెన్​ వీసా' మంజూరైంది. ఈ వీసాతో సానియా, ఆమె భర్త షోయబ్​ మాలిక్​ యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​లో పదేళ్ల పాటు నివసించేందుకు వీలు కలుగుతుంది. భారత్​ నుంచి బాలీవుడ్​ స్టార్స్​ షారుక్​ ఖాన్​, సంజయ్​ దత్​ తర్వాత ఈ గౌరవ వీసా అందుకున్న మూడో వ్యక్తిగా సానియా నిలిచింది.

తనకు యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ అరుదైన గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది సానియా. దుబాయ్​ యువరాజు షేక్​ మహ్మద్​ బిన్​ రషీద్​, అక్కడి పౌరసత్వ అధికార యంత్రాంగానికి, క్రీడా శాఖకు ధన్యవాదాలు తెలిపింది. దుబాయ్​ తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పిన ఆమె.. అక్కడే ఎక్కువగా గడపాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే అక్కడ టెన్నిస్​, క్రికెట్​ అకామీలు సానియా దంపతులు స్థాపించనున్నారు. ప్రస్తుతం ఆమె టోక్యో ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతోంది.

ఇదీ చూడండి: OLYMPICS: టోక్యో ఒలింపిక్స్​తో సానియా రికార్డు!

ABOUT THE AUTHOR

...view details