తెలంగాణ

telangana

ETV Bharat / sports

జపాన్​ ఓపెన్​కు సైనా నెహ్వాల్ దూరం - జపాన్ ఓపెన్

మంగళవారం ఆరంభమైన జపాన్ ఓపెన్​కు దూరమైంది సైనానెహ్వాల్. చివరి క్షణం వరకు ఆడుతుందనుకున్న తరుణంలో ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది.

సైనా

By

Published : Jul 24, 2019, 5:31 AM IST

అనారోగ్యం కారణంగా ఇండోనెేసియా ఓపెన్​కు దూరమైన సైనా నెహ్వాల్ జపాన్​ ఓపెన్​కూ అందుబాటులోకి రావట్లేదు. మొదట జపాన్​లో ఆడుతుందని అందరూ భావించారు. అయితే వచ్చే నెలలో ఉన్న వరల్డ్​ ఛాంపియన్​షిప్స్​ దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ ఏడాది వరుస గాయాలతో ముఖ్య టోర్నీలకు దూరమైంది సైనా. మడమ మొదలు మణికట్టు గాయం వరకు వరుస ఇబ్బందులతో సతమతమైంది. క్లోమగ్రంథి సమస్యతో ఆల్ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​లో సత్తాచాటలేకపోయింది.

ఏప్రిల్​లో కోలుకున్న సైనా ఇండోనేసియా మాస్టర్స్​ టైటిల్ నెగ్గింది. ఈ సీజన్​లో టైటిల్ గెలిచిన ఏకైక క్రీడాకారిణి సైనానే. తర్వాత ఫిట్​నెస్​ లేమితో ఇండోనేసియా ఓపెన్​కు దూరమైంది. గతంలో ఈ టైటిల్​ను మూడుసార్లు నెగ్గింది సైనా.

ప్రస్తుతం జపాన్ ఓపెన్​లో సింధుపైనే ఆశలు పెట్టుకుంది భారత్. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​కు వచ్చిన సింధు రన్నరప్​తో సరిపెట్టుకుంది. జపాన్​ క్రీడాకారిణి యమగూచి చేతిలో పరాజయం చెందింది. ప్రస్తుతం జపాన్ ఓపెన్​లో ఎలాగైన గెలిచి టైటిల్ ఆకలి తీర్చుకోవాలని అనుకుంటోంది.

ఇది చదవండి: టెస్టుల్లో కోహ్లీ అగ్రస్థానం పదిలం

ABOUT THE AUTHOR

...view details