తెలంగాణ అమ్మాయి రష్మిక భమిడిపాటి సత్తా చాటింది. జాతీయ టెన్నిస్ హార్డ్‌కోర్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రష్మిక 6-2, 7-6 (7/2)తో టాప్‌సీడ్ వైదేహి చౌదరి (గుజరాత్)ని వరుస సెట్లలో ఓడించింది.
జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌గా రష్మిక
జాతీయ టెన్నిస్ హార్డ్‌కోర్ట్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది తెలంగాణ అమ్మాయి రష్మిక భమిడిపాటి. మహిళల సింగిల్స్ ఫైనల్లో వైదేహి చౌదరిపై విజయంతో టైటిల్ సాధించింది.
తొలి సెట్ ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లిన రష్మిక.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి సెట్ గెలుచుకుంది. రెండో సెట్లో అయిదో గేమ్‌లో బ్రేక్ సాధించి 3-2తో నిలిచిన రష్మిక.. ఆ తర్వాత ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కోల్పోయింది. ఆపై స్కోర్లు సమం కావడం వల్ల సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో 7-2తో గెలిచిన రష్మిక సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అర్జున్ ఖాదె (మహారాష్ట్ర) గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 6-3, 6-4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై విజయం సాధించాడు.