తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్ ఓపెన్​ సెమీస్​లో రఫెల్ నాదల్ - సెమీస్

18 గ్రాండ్​స్లామ్​లు సొంతం చేసుకున్న రఫెల్ నాదల్ 19వ టైటిల్​పై కన్నేశాడు. యూఎస్ ఓపెన్ క్వార్టర్స్​లో అర్జెంటీనా ప్లేయర్ డీగోపై 6-4, 7-5, 6-2 తేడాతో నెగ్గి సెమీస్ చేరాడు.

రఫెల్ నాదల్

By

Published : Sep 5, 2019, 11:15 AM IST

Updated : Sep 29, 2019, 12:31 PM IST

యూఎస్ ఓపెన్ సెమీస్​లో నాదల్

ఫ్రెంచ్ ఓపెన్​ విజేత స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్​ సెమీస్​కు చేరాడు. న్యూయార్క్​లో జరిగిన పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో అర్జెంటీనాకు చెందిన డీగో స్క్వాట్జ్​మాన్​పై విజయం సాధించాడు. సెమీస్​లో ఇటలీకి చెందిన మ్యాటో బెరెత్తెనితో తలపడనున్నాడు.

డీగోపై 6-4, 7-5, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు రఫా. స్పెయిన్​ బుల్​కు ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. అర్జెంటీనా క్రీడాకారుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండు గంటల 46 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్​లో నాదల్ చెమటోడ్చాల్సి వచ్చింది.

ముఖ్యంగా తొలి రెండు సెట్లలో డీగో అద్భుతంగా పోరాడాడు. అయితే అనభవజ్ఞుడైన నాదల్ ప్రత్యర్థి ఎదురుదాడిని తిప్పికొట్టాడు. ఫలితంగా రెండు సెట్లలోనూ విజయం సాధించాడు. మూడో సెట్​లో అర్జెంటీనా ప్లేయర్ సులభంగానే రఫాకు లొంగిపోయాడు.

బుదవారం జరిగిన క్వార్టర్స్​లో గేల్ మోనోఫిస్​పై 3-6, 6-3, 6-2, 3-6, 7-6(5) తేడాతో తీవ్రంగా శ్రమించి గెలిచాడు ఇటలీ ఆటగాడు మ్యాటో బెరెత్తిని. యూఎస్ ఓపెన్​లో 42 ఏళ్ల తర్వాత సెమీస్ చేరిన ఇటలీ క్రీడాకారుడిగా బెరెత్తిని రికార్డు సృష్టించాడు. సెమీస్​లో నాదల్​తో తలపడనున్నాడు.

ఇది చదవండి: మళ్లీ ఆదుకున్న స్మిత్... ఆసీస్ స్కోరు 170/3

Last Updated : Sep 29, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details