క్లే కోర్టు మెషీన్ రఫెల్ నాదల్(Rafael Nadal) తన 35వ పుట్టినరోజును విజయంతో ప్రారంభించాడు. ఫ్రెంచ్ఓపెన్(French Open)లో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్థానిక టెన్నిస్ ఆటగాడు రిచర్డ్ గ్యాస్క్వెట్పై 6-0, 7-5, 6-2 తేడాతో గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ టోర్నీలోని మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
French Open: మూడో రౌండ్‌కు రఫెల్ నాదల్
13సార్లు రోలాండ్ గారోస్(ఫ్రెంచ్ ఓపెన్)(French Open) ఛాంపియన్‌గా నిలిచిన రఫెల్ నాదల్(Rafael Nadal).. రెండో రౌండ్లో అవలీలగా గెలుపొంది.. మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. స్థానిక టెన్నిస్ క్రీడాకారుడు పాట్ రిచర్డ్ గ్యాస్క్వైట్(Richard Gasquet)పై రెండోరౌండ్లో గెలుపొంది.. టోర్నీలో తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు.
French Open: మూడో రౌండ్‌కు రఫెల్ నాదల్
అయితే 1999లో జరిగిన టూర్నోయి డెస్ పెటిట్స్ అండర్-14 సెమీస్‌లో రిచర్డ్ గ్యాస్క్వైట్(Richard Gasquet)పై తలపడిన నాదల్ అందులో ఓడాడు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇప్పుడు నాదల్ పైచేయి సాధించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 13సార్లు విజేతగా నిలిచిన నాదల్.. మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకునే విధంగా దూకుడుగా ఆడుతున్నాడు.
ఇదీ చూడండి:French Open: మూడో రౌండ్‌కు జకోవిచ్, ఫెదరర్