స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ రికార్డు సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో 1000వ మ్యాచ్‌లో గెలిచి, ఈ ఘనత సాధించిన నాలుగోవాడిగా నిలిచాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారిస్ మాస్టర్స్‌లో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించి, ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇతడి కంటే ముందు జిమ్మీ కానర్స్(1,274), రోజర్ ఫెదరర్(1,242), ఇవాన్ లెండిల్(1,068) ఉన్నారు.
టెన్నిస్ సింగిల్స్‌లో నాదల్ 1000 విజయాలు - ఫెదరర్ నాదల్
టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో ప్రముఖ ఆటగాడు నాదల్ అద్భుతం చేశాడు. 1000 మ్యాచ్‌ల్లో గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు.
రఫెల్ నాదల్
"ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు అంటే నా వయసు పెరుగుతున్నట్లే. చాలా ఏళ్లుగా నేను ఆటలో కొనసాగుతూ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని నాదల్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.
ఇవీ చదవండి: