ఆరుసార్లు మియామీ ఓపెన్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది ఈ టోర్నీలో పాల్గొనట్లేదు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కరోనా నిబంధనల వల్లే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్లు నాదల్, ఫెదరర్ తప్పుకొన్నారు. మార్చి 23న ఈ టోర్నీ ప్రారంభంకానుంది.
"ప్రియమైన అభిమానులారా, ఈ ఏడాది నేను మియామీ ఓపెన్లో పాల్గొనట్లేదు. ఈ సమయాన్ని నా కుటుంబంతో గడపడానికి ఉపయోగిస్తా. ఈ కరోనా నిబంధనల నడుమ నా పని, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవాలని భావిస్తున్నా"