అత్యధిక సార్లు నంబర్‌వన్‌గా ఏడాదిని ముగించిన ఆటగాడిగా టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును నొవాక్ జకోవిచ్ సమం చేశాడు. తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు రఫెల్ నాదల్ వచ్చే వారం జరిగే సోఫియా ఈవెంట్ నుంచి తప్పుకోగా.. 2020ని జకోవిచ్ అగ్రస్థానంతో ముగించడం ఖాయమైంది.
జకోవిచ్ నయా రికార్డు.. సంప్రాస్ సరసన చేరిక - నంబర్‌వన్ జకోవిచ్
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అత్యధిక సార్లు నంబర్‌వన్‌గా ఏడాది ముగించిన ఆటగాళ్ల సరసన చేరాడు. టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు.
జకోవిచ్ నయా రికార్డు: సంప్రాస్ సరసన చేరిక
సంప్రాస్ లాగే జకోవిచ్ ఆరుసార్లు 'ఇయర్ ఎండ్ నంబర్‌వన్'గా నిలిచాడు. గతంలో 2011, 2012, 2014, 2015, 2018లో జకోవిచ్ ఈ ఘనత సాధించాడు. 33 ఏళ్ల జకోవిచ్ ఇప్పటిదాకా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు.