తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెన్నిస్ ర్యాంకింగ్స్: టాప్​లో జకోవిచ్​, ఒసాకా - nadal

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో పురుషుల విభాగంలో జకోవిచ్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. మహిళల్లో నవోమి ఒసాకా తిరిగి నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.

జకోవిచ్

By

Published : Aug 12, 2019, 6:34 PM IST

Updated : Sep 26, 2019, 6:55 PM IST

ఆదివారం జరిగిన రోజర్స్ కప్ ఫైనల్​ గెలిచిన రఫెల్ నాదల్.. యూఎస్​ ఓపెన్​ కోసం సిద్ధమవుతున్నాడు. కానీ ఈ విజయం ర్యాంకింగ్స్​లో జకోవిచ్​ను అధిగమించేందుకు సరిపోలేదు. ఏటీపీ సోమవారం ప్రకటించిన ర్యాంకుల్లో సెర్బియా స్టార్​ జకోవిచ్​ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. నాదల్, ఫెదరర్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా ఓపెన్​ విజేత నవోమి ఒసాకా అగ్రస్థానానికి చేరింది. గత వారం జరిగిన రోజర్స్​ కప్​ క్వార్టర్​ ఫైనల్​లో సెరెనా చేతిలో ఓడిన ఈ క్రీడాకారిణీ.. రెండో రౌండ్​లో ఆష్లే బార్టీని ఓడించడం కలిసొచ్చింది.

జనవరిలో మొదటిసారి నంబర్ వన్​ స్థానాన్ని పొందింది జపాన్​కు చెందిన ఒసాకా. ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్​ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణీగా ఘనత సాధించింది.

ఏడు వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగిన ఆష్లే బార్టీ రెండో స్థానానికి పడిపోయింది. ప్లిస్కోవా మూడు స్థానంలో నిలిచింది. మాజీ నంబర్​వన్ సెరెనా విలియమ్స్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

పురుషుల ర్యాంకింగ్స్ :

సంఖ్య పేరు పాయింట్లు
1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 12,325
2 రఫెల్ నాదల్ (స్పెయిన్) 7,945
3 రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 7, 460
4 డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 4,925
5 నిషికొరి (జపాన్)

4,040

మహిళల ర్యాంకింగ్స్​ :

సంఖ్య పేరు పాయింట్లు
1 నవోమి ఒసాకా (జపాన్) 6,417
2
ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)
6,256
3 కరోలినా ప్లిస్కోవా ( చెక్ రిపబ్లిక్) 6,185
4 సిమోనా హలెప్ ( రొమేనియా) 5,223
5 కికి బెర్టెన్స్ (నెదర్లాండ్) 5, 120
Last Updated : Sep 26, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details