టెన్నిస్ ఆడాలంటే రాకెట్‌ను గట్టిగా పట్టుకునేందుకు చేతి వేళ్ల బలం కావాలి. రెండు చేతులు ఉపయోగిస్తూ ప్లేయర్లు బలంగా షాట్లు కొట్టడం చూస్తూనే ఉంటాం. కోర్టులో వేగంగా కదలాలంటే పాదాలు సరిగ్గా ఉండాలి. కానీ రెండు చేతులకు కలిపి ఎనిమిది వేళ్లతో, రెండు పాదాలకు కలిపి ఏడు వేళ్లతో ఉన్న ఓ అమ్మాయి టెన్నిస్ ఆడగలదనుకుంటామా? ఆ అసాధ్యాన్ని అందుకుంది బ్రిటన్‌కు చెందిన ఫ్రాన్సెస్కా జోన్స్. బలహీనతలను దాటి ఈ అమ్మాయి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో నిలిచింది.
జోన్స్ ఒక్కో చేతికి ఓ బొటనవేలితో పాటు మరో మూడు వేళ్లు మాత్రమే ఉంటాయి. ఎడమ కాలికి నాలుగు వేళ్లుంటే.. కుడి కాలికి మూడు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 245 స్థానంలో ఉన్నప్పటికీ.. అర్హత టోర్నీలో పాల్గొనే అవకాశం అదృష్టం రూపంలో ఆమెను వరించింది. ఆ క్వాలిఫయర్స్‌లో తనకంటే మెరుగైన క్రీడాకారిణులను ఓడించిన జోన్స్.. ప్రధాన డ్రా మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. తొలి రౌండ్లో ఆమె.. ప్రపంచ 60వ ర్యాంకు క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ (అమెరికా)తో తలపడనుంది.
ఆటంకాలను అధిగమిస్తూ..