హోరాహోరీగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్(Djokovic).. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను(Nadal)ను 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో క్రీడాప్రముఖులు పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా జకోవిచ్‌ను అభినందించడం సహా నాదల్ ఓటమిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా కొందరు స్పందించారు. అయితే మాజీ బ్యాట్స్‌మన్ జాఫర్ హాస్యం జోడిస్తూ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షించింది. "ఫ్రెంచ్ఓపెన్ సెమీఫైనల్లో నాదల్ ఓడిపోయాడా? 'ఇది పక్కాగా జోక్.. ఓహ్ ఇట్ ఈజ్ ఏ డిజోక్" అని హాస్యస్పదంగా జాఫర్ ట్వీట్ చేశాడు. Djokovic పేరును D'joke' అంటూ సంబోధించాడు.
French Open: 'నాదల్‌కు ఓటమా? జోక్‌లా ఉంది!'
ఫ్రెంచ్ఓపెన్ సెమీఫైనల్లో జకోవిచ్, నాదల్ గెలుపోటమిపై పలువురు భారత క్రికెటర్లు స్పందించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
క్రీడల్లో పట్టువదలక పోరాడటం అంటే ఏంటో తెలియాలంటే ఈ మ్యాచ్‌ను చూడాలని క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఎవరైనా భారతీయులు రాత్రి ఈ మ్యాచ్ చూడకపోతే కనీసం రీప్లే అయినా చూడాలని కోరాడు. ఇలాంటి పోరు హైలైట్స్‌లో చూడటం కూడా సరిపోదని వ్యాఖ్యానించాడు. రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. "ఇది కేవలం టెన్నిస్ కాదని, ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్ల మధ్య జరిగిన అత్యున్నత ప్రదర్శన" అని అశ్విన్ కొనియాడాడు. "తీవ్రత, Sheer passion, ఎంతో ఆనందం" అంటూ సుందర్ ట్వీట్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో గత 14 సెమీ ఫైనల్స్‌లో నాదల్‌కు ఇదే తొలి ఓటమి. మరోవైపు జకో ఫైనల్లో గెలిస్తే అతడికిది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అవుతుంది.
ఇదీ చూడండి: French Open: జకోవిచ్ ఫైనల్‌కు.. నాదల్ ఇంటికి