55 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు డేవిస్‌కప్ జట్టును పంపనుంది భారత్. పాక్‌లో జరగనున్న ఈ టోర్నీ అర్హత పోటీలకు ఆగస్టు 5న జట్టును ప్రకటించనుంది ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ). ఈ విషయాన్ని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరొన్మై ఛటర్జి ఆదివారం తెలిపారు.
"డేవిస్ కప్ జట్టును ఆగస్టు 5న పకటిస్తాం. ర్యాంకింగ్స్ ఆధారంగా టీమ్‌ను ఎంపిక చేయనున్నాం. పాకిస్థాన్ వీసా ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే త్వరలో తగిన లాంఛనాలు ప్రారంభిస్తాం" -హిరొన్మై ఛటర్జి, ఏఐటీఏ జనరల్ సెక్రటరీ.
సింగిల్స్ విభాగంలో భారత నెంబర్ వన్ ర్యాంకర్ ప్రజ్నేశ్, రామ్ కుమార్ రామనాథన్, డబుల్స్ జోడిగా రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ ఎంపికయ్యే అవకాశముందని ఛటర్జి అన్నారు. ఇటీవలే మహేశ్ భూపతి, కోచ్ జీషన్ అలీ ఒప్పందం పూర్తయిన సందర్భంగా వారి స్థానాల్లో ఎవరు ఉంటారనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.