కరోనా వైరస్‌పై పోరాటం కోసం స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రూ.7.75 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అక్కడ 8,800 మంది కరోనా బారిన పడగా, 86 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుండగా.. ఫెదరర్ ఈ జాబితాలో చేరాడు. మరోవైపు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అతడి ఏజెంట్.. కరోనా బాధితుల కోసం తమ హోటల్లో రెండు ఐసీయూ వార్డులు తీర్చిదిద్ది ప్రభుత్వానికి అప్పగించారు.
దాదా రూ.50 లక్షల బియ్యం