తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2021, 10:10 PM IST

Updated : Jul 11, 2021, 10:45 PM IST

ETV Bharat / sports

వింబుల్డన్ టైటిల్​ జకోదే.. కెరీర్​లో 20వ గ్రాండ్​స్లామ్​

వింబుల్డన్(Wimbledon) ఫైనల్​లో గెలిచిన సెర్బియా స్టార్​ నొవాక్ జకోవిచ్ కెరీర్​లో 20వ గ్రాండ్​స్లామ్​ టైటిల్​ను ముద్దాడాడు.​​ ఇటలీ ఆటగాడు బెరిటిని(Matteo Berrettini)పై విజయం సాధించాడు.

f
f

అత్యధిక గ్రాండ్​స్లామ్​ సింగిల్స్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్(20)ను సమం చేశాడు సెర్బియా స్టార్​ నొవాక్ జకోవిచ్. ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్( Wimbledon) పురుషుల సింగిల్స్​ ఫైనల్​లో విజయం సాధించి గ్రాండ్​ స్లామ్​ టైటిల్​ను కైవసం చేసుకున్నాడు.

ఇటలీ ఆటగాడు బెరిటిని(Matteo Berrettini)పై తొలి సెట్​లో ఓడినా తర్వాత వరుస సెట్లలో ​6-7(4-7),6-4,6-4,6-3 తేడాతో విజయాన్ని అందుకున్నాడు.

జకోకు.. కెరీర్​లో ఆరో వింబుల్డన్​ టైటిల్​. 9 ఆస్ట్రేలియన్​ ఓపెన్​, 3 యూఎస్​ ఓపెన్​, 2 ఫ్రెంచ్​ ఓపెన్​ గ్రాండ్​స్లామ్​లతో కలిపి మొత్తం 20 టైటిళ్లు అందుకున్నాడు. స్విట్జర్లాండ్​ స్టార్​ ఫెదరర్​, స్పెయిన్​ బుల్​ రఫెల్​ నాదల్​ కూడా 20 టైటిళ్లు గెలిచారు.

క్యాలెండర్​ ఇయర్​ గ్రాండ్​ స్లామ్​..

ఈ క్యాలెండర్​ ఇయర్​లో ఆస్ట్రేలియన్​ ఓపెన్​, ఫ్రెంచ్​ ఓపెన్​, వింబుల్డన్​ గెలిచిన జకోవిచ్​.. యూఎస్​ ఓపెన్​పైనా కన్నేశాడు. ఆ మేజర్​ టోర్నీ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. అదీ గెలిస్తే.. 52 ఏళ్లుగా రాడ్​ లేవర్​ పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది.

ఇదీ చదవండి:Wimbledon: క్రొయేషియా జోడీకే వింబుల్డన్​ డబుల్స్​ ట్రోఫీ

Last Updated : Jul 11, 2021, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details