Djokovic Australian Open 2022: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ కొత్త ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడతాడా? లేదా? అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కల్పిస్తుండగా.. జకోవిచ్ ఇప్పటిదాకా ఒక్క డోస్ టీకా కూడా వేసుకోలేదు. ఇంకో రెండు వారాల్లోనే టోర్నీ ఆరంభం కాబోతుండగా.. ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు టోర్నీలో ఆడటంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Australia Open 2022: జకోవిచ్‌పై వీడని ఉత్కంఠ - ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 నొవాక్ జకోవిచ్
Djokovic Australian Open 2022: ఈ నెల 17న ప్రారంభంకానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ ఆడతాడా? లేదా? అన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారే ఈ టోర్నీలో పాల్గొనాలని నిర్వాహకులు ఇప్పటికే నిబంధనలు పెట్టారు. అయితే అతడు ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదు.
ఈనెల 17న మెల్‌బోర్న్ పార్క్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం మిగతా క్రీడాకారులంతా సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పురుషుల ఏటీపీ కప్ టీమ్ ఈవెంట్ జరుగుతుండగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా రెండు డబ్ల్యూటీఏ, ఒక ఏటీపీ టోర్నీలు నిర్వహించనున్నారు. అయితే జకోవిచ్ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 9 సార్లు విజేతగా నిలిచిన నొవాక్ గ్రాండ్‌స్లామ్‌లో ఆడే అవకాశాలు లేకపోలేదని టోర్నీ సీఈఓ టైలీ తెలిపాడు. ప్రసుత్తం ఫెదరర్, నాదల్, జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో సమానంగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఇటలీ టెన్నిస్ భామ.. పరువాల పుత్తడిబొమ్మ