భారత్-పాకిస్థాన్ మధ్య డేవిస్ కప్ మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికను ప్రకటించింది అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్). కజకిస్థాన్ రాజధాని నుర్ సుల్తాన్‌ను వేదికగా ప్రతిపాదించింది. ఇస్లామాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదనను ఐటీఎఫ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
భారతీయ భక్తులు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండానే పాక్‌లోకి వస్తోంటే.. ఆటగాళ్లకు మాత్రం సెక్యురిటీ విషయం లోటుగా ఎలా కనిపిస్తుందంటూ పాక్ టెన్నిస్ సమాఖ్య ఇంతకుముందు ఐటీఎఫ్ ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. ఇస్లామాబాద్‌లో ఆడటానికి వారికేమి అభ్యంతరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.