పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపింది భారత వాయుసేన. తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా అండర్-16 స్థాయిలో జరిగే జూనియర్ డేవిస్ కప్, ఫెడ్కప్లను నిర్వహించే హక్కును కోల్పోయింది భారత్. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ టెన్నిస్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు ఉంది. ఈ పోటీలను బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లలో నిర్వహించనున్నారు.
భారత్ నుంచి బ్యాంకాక్‌కు తరలిన జూనియర్ డేవిస్ కప్ - venue change
జూనియర్ డేవిస్ కప్, ఫెడ్కప్ల వేదికను భారత్ నుంచి బ్యాంకాక్‌కు మార్చింది అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్. ఏప్రిల్ 8న డేవిస్ కప్,15న ఫెడ్‌కప్ ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 8నుంచి 13 వరకు డేవిస్‌కప్, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఫెడ్‌కప్ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్).... అఖిల భారత టెన్నిస్ ఫెడరేషన్(ఏఐటీఏ), ఆసియన్ టెన్నిస్(ఏటీఎఫ్)లతో చర్చించిన తర్వాత వేదికను మార్చింది.
నిధుల సమస్య మరో కారణమని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరోన్మాయ్ ఛటర్జీ తెలిపారు. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు. గతంలోనూ కోల్‌కతా వేదికగా డేవిస్ కప్ నిర్వహించినపుడు అనుకున్నంతగా నిధులు సమకూరలేదని ఛటర్జీ చెప్పారు.